Post office: ప్రభుత్వ స్కీమ్.. రూ.333 తో.. రూ.16 లక్షలు..!

-

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ లో కనుక డబ్బులు పెడితే అదిరే లాభాలని పొందేందుకు అవుతుంది. సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల్ని తెచ్చింది. మన దగ్గర వుండే డబ్బులకి తగినట్లుగా ఇన్వెస్ట్ చేసుకుని మంచి రాబడిని పొందవచ్చు. బ్యాంకులు లో టర్మ్ డిపాజిట్ల వంటివి వున్నాయి. అయినా సరే పోస్టాఫీసు డిపాజిట్లకే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. బ్యాంకుల్లో టర్మ్ డిపాజిట్ల వంటివి వున్నా కూడా ఎక్కువ మంది ఈరోజుల్లో పోస్టాఫీసు డిపాజిట్లలో డబ్బులు పెడుతున్నారు. ప్రభుత్వ పథకం లో డబ్బులు పెడితే రిస్క్ కూడా ఉండదు. వడ్డీ రేట్లు సైతం ఇటీవల బ్యాంకు ఎఫ్‌డీలతో సమానంగా వున్నాయి.

పోస్టాఫీసులో నెలకు రూ.1000, రూ.5000, రూ.10000 డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత రాబడి వస్తుందో చూడాలి. పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో నెల నెల ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మెచ్యూరిటీ పీరియడ్ 5 ఏళ్లు గా వుంది. వడ్డీ రేటు 6.2గా ఉంది. ఏప్రిల్ 1, 2023 నుంచే ఈ వడ్డీ రేట్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. మెచ్యూరిటీ తర్వాత మరో 5 ఏళ్లు పొడిగించుకోవచ్చు. మీరు కనీసం దీనిలో రూ.100 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు.

మాక్సిమం లిమిట్ ఏమి లేదు. నెలకు రూ.1000 అంటే రోజుకు రూ.33 ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయానికి 5 ఏళ్లకు మీకు రూ.70,431 అందుతాయి. ఇంకో ఐదేళ్లు ఎక్స్టెండ్ చేసుకుంటే 10 ఏళ్లకు మీకు రూ.1.66 లక్షలు అందుతాయి. రోజుకు రూ.166 అంటే నెలకు రూ.5000 ఇన్వెస్ట్ చేసారంటే 5 ఏళ్ల కాలంలో మీ డబ్బు మొత్తం రూ.3.52 లక్షలు అవుతుంది. ఇంకో ఐదేళ్లు పొడిగించినట్లయితే 10 ఏళ్ల సమయంలో రూ.8.32 లక్షలు వస్తాయి. రోజుకు రూ.333 ఇన్వెస్ట్ చేస్తే అంటే నెలకి రూ.10 వేలు ఇన్వెస్ట్ చేస్తే 5 ఏళ్ల తర్వాత మీ కార్పస్ రూ. 7.04 లక్షలు అవుతుంది. అప్పుడు మరో ఐదేళ్లు పొడిగించినట్లయితే 10 ఏళ్ల సమయానికి వడ్డీతో పాటు రూ.16.6 లక్షలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news