సికింద్రాబాద్​లో వాన బీభత్సం.. నాలాలో పడి చిన్నారి మృతి

-

హైదరాబాద్​లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. గత రెండ్రోజులు కాస్త గ్యాప్ ఇచ్చిన వరణుడు.. ఇవాళ తెల్లవారుజాము నుంచి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో ఇవాళ కురిసిన వాన బీభత్సం సృష్టిస్తోంది. ఏకధాటిగా కురిసిన వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరాయి. అపార్ట్​మెంట్ల సెలార్లలోకి నీరు చేరి వాహనాలు సగం వరకు మునిగిపోయాయి. రహదరాలుపైకి వరద నీరు చేరి ట్రాఫిక్ స్తంభించింది. ఉదయాన్నే పనులపై బయటకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరోవైపు వాన బీభత్సానికి నగరంలో ఓ చిన్నారి బలైపోయింది. సికింద్రాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి కళాసిగూడలోని నాలా ఫుట్‌పాత్‌ పైకప్పు నుంచి పడి 6 సంవత్సరాల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కిరాణా వస్తువులు కొనుగోలు చేసేందుకు దుకాణానికి వెళ్తున్న క్రమంలో నాలాలో పడి కొంత దూరం కొట్టుకుపోయింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది సాయంతో నాలాలోని చిన్నారి మృతదేహాన్ని బయటకు తీసి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

Read more RELATED
Recommended to you

Latest news