రోజూ రూ. 45 ఇన్వెస్ట్ చేస్తే.. 25 లక్షలు ని పొందవచ్చు..!

-

చాలా మంది వారికి నచ్చిన స్కీమ్స్ లో వాళ్ళు డబ్బులని పెడుతూ వుంటారు. ఇలా నచ్చిన పథకాల్లో డబ్బులని పెట్టడం వలన అనేక లాభాలని పొందేందుకు ఆవుతుంది. దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల పాలసీలని తీసుకు వచ్చింది. ఈ పాలసీల తో అనేక లాభాలని పొందవచ్చు. పిల్లల చదువు, వివాహం, పదవీ విరమణ తదితర ఖర్చుల కోసం చాలా మంది ఈ పాలసీల్లో ఇన్వెస్ట్ చేస్తూ వుంటారు. LIC అందించిన పాలసీల లో న్యూ జీవన్ ఆనంద్ పాలసీ కూడా ఒకటి. న్యూ జీవన్ ఆనంద్ పాలసీ కి సంబంధించి పూర్తి వివరాలని ఇప్పుడు చూద్దాం…

న్యూ జీవన్ ఆనంద్ పాలసీ అనేది భాగస్వామ్య హోల్ లైఫ్ ఎండోమెంట్ ప్లాన్. పొదుపు, రక్షణ రెండింటి ప్రయోజనాన్ని ఈ ప్లాన్ తో పొందవచ్చు. ఇందులో పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో బలమైన రాబడిని పొందవచ్చు. హామీతో కూడిన రాబడులతో పాటు అదనపు ప్రయోజనాలను కూడా పొందవచ్చు. రెగ్యులర్ ప్రీమియం చెల్లింపు ఎంపికను కూడా పొందుతారు. మీరు 100 సంవత్సరాల పాటు పాలసీ కవర్ ప్రయోజనాన్ని ఈ పాలసీ తో పొందవచ్చు. పాలసీ మెచ్యూరిటీ వరకు జీవించి ఉంటే లాభాలలో భాగస్వామ్యం ప్రయోజనం కూడా మీకు ఉంటుంది.

పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా ఉంటుంది. కనీసం రూ. 5 లక్షల హామీ మొత్తాన్ని పొందుతారు. 35 సంవత్సరాల వ్యవధిలో మొత్తం రూ. 25 లక్షలు పొందుతారు. 35 సంవత్సరాల కాలపరిమితిని కనుక మీరు సెలెక్ట్ చేస్తే ప్రతి సంవత్సరం రూ. 16,300, నెలవారీ ప్రాతిపదికన రూ. 1,358 పెట్టుబడి పెట్టవలసి వుంది. అంటే దీనిలో మీరు కేవలం 45 రూపాయలు మాత్రమే పెట్టుబడి కింద పెట్టాలి. మెచ్యూరిటీపై మొత్తం 25 లక్షల రూపాయిలు మీకు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news