వేసవిలో పక్కా ఈ జావ ని తీసుకోండి.. వీటి లాభాలని చూస్తే షాక్ అవుతారు..!

-

వేసవికాలంలో ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టకపోతే రకరకాల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. వేసవి కాలంలో డిహైడ్రేషన్ మొదలు వివిధ సమస్యలు ఉంటాయి అందుకని వేసవికాలంలో జాగ్రత్తగా ఉండాలి. వేసవికాలంలో మనం తీసుకునే ఆహార పదార్థాలపై ధ్యాస పెట్టాలి. ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకోవడం.. నీళ్లు, నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా ముఖ్యం. వేసవికాలంలో కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యం మరింత బాగుంటుంది వేసవికాలంలో కీరదోస పుదీనా ఇలాంటి వాటిని చేర్చుకుంటే బాగుంటుంది.

అలానే వేసవికాలంలో ఈ జావని తీసుకుంటే కూడా ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది మరి ఇక ఈ జావ ని ఎలా తయారు చేసుకోవాలి? ఎలా తీసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం… దీని కోసం అరకేజీ బియ్యం, ఓ పావు పెసలు, మొలకెత్తిన రాగులు 100 గ్రాములు, గోధుమలు 50 గ్రాములు, ఓట్స్ 50 గ్రాములు, బార్లీ 25 గ్రాములు, సోయా గింజలు 25 గ్రాములు తీసుకోండి. ఈ పదార్దాలని మీరు ముందు
విడివిడిగా వేయించాలి. ఓట్స్‌ను అక్కర్లేదు. అన్నీ మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.

ఒకటికి నాలుగువంతుల నీళ్లు పోసుకుని పది నిమిషాల పాటు కుక్ చేయండి. ఆ తరవాత ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. కావాలంటే ఉడికించిన కూరగాయలు వేసుకోవచ్చు. నెయ్యి కూడా వెయ్యచ్చు. ఈ జావ ని తీసుకుంటే జీర్ణం బాగా అవుతుంది. తక్షణ శక్తి అందుతుంది. అలానే ఇది ఆకలిని నియంత్రిస్తుంది. బరువును కూడా తగ్గచ్చు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారికి ఇది బెస్ట్. క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్‌ బి తో పాటుగా పీచు, మాంసకృత్తులు కూడా దీనిలో ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news