చాలా మంది ఈ మధ్య కాలం లో నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. ఇలా డబ్బులు పెడుతూ ఉంటే ఎక్కువగా లాభాలని పొందొచ్చు. పైగా భవిష్యత్తు లో ఏ ఇబ్బంది రాదు. మంచిగా ఇన్వెస్ట్ చేస్తే ఏ ఇబ్బంది లేదు. ముఖ్యంగా భవిష్యత్తు కోసం ఫైనాన్షియల్ గా ప్లాన్ చేస్తున్నారా..? మీరు తప్పనిసరిగా LIC కన్యాదాన్ పాలసీ గురించి తెలుసుకోవాలి.
కుమార్తె భవిష్యత్తును సురక్షితంగా ఉంచడమే కాకుండా అమ్మాయి చదువు, కెరీర్, పెళ్లి ఇలాంటి వాటి గురించి కూడా ఆలోచించాల్సిన పనే లేదు. నెలకు రూ. 3,400 పెట్టుబడి పెడితే మెచ్యూరిటీపై రూ. 27 లక్షలు పొందవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. తండ్రి కి కనీసం 30 సంవత్సరాలు కుమార్తెకు కనీసం ఒక సంవత్సరం ఉండాలి. ఇక వయస్సు విషయానికి వస్తే…
మీరు ఈ పాలసీని 13 నుండి 25 సంవత్సరాల దాకా తీసుకోవచ్చు. రోజుకు రూ.121 డిపాజిట్ చేయాలి. నెలలో మీరు మొత్తం రూ. 3,600 డిపాజిట్ చేసుకోవాలి. పాలసీ మెచ్యూరిటీ వ్యవధి పూర్తయిన తర్వాత రూ. 27 లక్షల మొత్తాన్ని పొందవచ్చు. అంటే రోజుకు రూ.75 డిపాజిట్ చెయ్యండి. 25 ఏళ్ల తర్వాత రూ.14 లక్షలు వస్తాయి.
ఇక ట్యాక్స్ బెనిఫిట్స్ విషయానికి వస్తే.. ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 80C పరిధి లోకి వస్తుంది. కాబట్టి డిపాజిట్ చేసిన ప్రీమియంపై కూడా ట్యాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు. దీనిలో మీరు రూ. 1.50 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ ని పొందొచ్చు.
ఇక ఏయే పత్రాలు అవసరం అనేది చూస్తే.. ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం అవసరం. పాలసీదారుడు చనిపోతే కుటుంబ సభ్యులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు వస్తాయి. అదే సాధారణ పరిస్థితుల్లో మరణిస్తే రూ.5 లక్షలు వస్తాయి. 25 సంవత్సరాలు పూర్తయిన తర్వాత రూ.27 లక్షలు వస్తాయి.