రోజుకి యాభై ఆదా చేస్తే రూ. 35 లక్షలు…!

-

చాలా మంది పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో డబ్బులు పెడుతూ వుంటారు. పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో డబ్బులు పెడితే మంచిగా డబ్బులు వస్తాయి. ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. స్కీమ్స్ లో డబ్బులను పెట్టి పొదుపు చేసుకుంటేనే భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. అయితే పోస్టాఫీస్ అందించే స్కీమ్స్ లో గ్రామీణ సురక్ష యోజన స్కీమ్ ఒకటి.

ఇక ఈ స్కీమ్ కోసం పూర్తి వివరాలను చూస్తే.. గ్రామీణ సురక్ష యోజన పథకం కింద 55 ఏళ్ల టర్మ్‌ పాలసీ తో నెలకి రూ. 1515 చెల్లిస్తూ ఉంటే మెచ్చూరిటీ సమయానికి మొత్తం 10 లక్షలు అవుతాయి. అలానే ఇతర ప్రయోజనాలతో సహా రూ. 31,60,000 అందుతుంది. అదే ఒకవేళ అరవై ఏళ్ల పాలసీ తీసుకుంటే మొత్తం రూ. 34.60 లక్షలు పొందొచ్చు.

ఇక అర్హతని చూస్తే.. పాలసీదారుడి వయసు కనీసం 19 ఏళ్లు, గరిష్ట వయస్సు 55 ఏళ్లు ఉండాలి. ఈ స్కీమ్ లో డబ్బులు పెట్టాలంటే రూ. 10 వేల నుంచి పెట్టచ్చు. గరిష్టంగా రూ. 10 లక్షల వరకు పెట్టచ్చు. 59 ఏళ్ల వయసు వరకు పాలసీని ఎండోమెంట్ అసూరెన్స్ పాలసీగా మార్చుకోవచ్చు కూడా. ప్రీమియం చెల్లింపు నిలిచిపోయిన ఏడాది వరకు లేదా మెచ్యూరిటీ నిండిన ఏడాది లోపు ఎండోమెంట్ అసూరెన్స్ పాలసీగా మార్చవచ్చు. ఈ స్కీమ్ కింద ప్రతీ ఏడాదికి రూ. 1000 మొత్తానికి రూ. 60 బోనస్‌గా ఉంటుంది. ఇలా ఈ స్కీమ్ తో ఈ లాభాలను పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news