నాకు 50 వేల మెజారిటీ పక్కా..వాళ్లకు డిపాజిట్లు గల్లంతే – KA పాల్

-

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌ గురువారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఆ సమయానికి బారులు తీరిన వారందరికీ ఓటు హక్కు వినియోగించుకొనే అవకాశం కల్పించారు. రాత్రి 10.30 గంటల వరకు ఓటు వేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 92 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 6న నల్గొండలో జరగనున్న ఓట్ల లెక్కింపులో వారి భవితవ్యం తేలనుంది.

అయితే.. మునుగోడు ఉప ఎన్నికల్లో తన విజయం ఖాయమని కేఏ పాల్ మరోసారి ధీమా వ్యక్తం చేశారు.1.05 లక్షల మంది యువత తనకే ఓటేశారని, కనీసం 50వేల మెజార్టీతో గెలవడం పక్కా అని పోలింగ్ ముగిసిన తర్వాత తెలిపారు. అందరూ తనకు కంగ్రాట్స్ చెబుతున్నారని, కేసీఆర్ ఎంత అవినీతి చేసినప్పటికీ ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించాలని తెలిపారు. రెండు రోజులు ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ లను కాపాడుకుందాం అని యువతకు పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news