7 రూపాయలు పొదుపు చేస్తే చాలు.. నెలకి ఐదు వేల పెన్షన్..!

-

ఈ మధ్య కాలం లో ఎక్కువ మంది వారికి నచ్చిన పథకాల్లో డబ్బులు పెడుతున్నారు. ఇలా డబ్బులు పెట్టడం వలన చక్కటి లాభాలని పొందేందుకు అవుతుంది. అటల్ పెన్షన్ యోజన స్కీమ్ కూడా పాపులర్ స్కీమ్ ఏ. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే పెన్షన్ ని పొందొచ్చు.

ఇక ఈ స్కీమ్ కోసం పూర్తి వివరాలని చూస్తే.. ఈ స్కీమ్ లో కోట్లాది మంది చేరారు. ఇందులో భార్యాభర్తలిద్దరూ చేరవచ్చు. రిటైర్మెంట్ తర్వాత ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో ఈ స్కీమ్‌ను తీసుకు వచ్చింది. 18 ఏళ్ల నుంచి 40 సంవత్సరాల వయసున్న వారు ఈ స్కీమ్ లో చేరేందుకు అర్హులే.

కాంట్రిబ్యూట్ బట్టీ పెన్షన్ వస్తుంది. 60 ఏళ్ల వయసు నిండిన తర్వాత పెన్షన్ ఇస్తారు. 18 ఏళ్ల వయసు వారు నెలకు రూ.42 ఇన్వెస్ట్ చేస్తే 60 ఏళ్ల వయసు తర్వాత కచ్చితంగా రూ.1000 చొప్పున పెన్షన్ మీకు వస్తుంది. నెలకు రూ.42 అంటే రోజుకు రూపాయి కంటే కొంచెం ఎక్కువ. నెలకు రూ.210 చొప్పున అటల్ పెన్షన్ యోజనలో పెడితే 60 ఏళ్లు నిండిన తర్వాత రూ.5000 పెన్షన్ మీకు వస్తుంది. ఈ స్కీమ్ లో మీరు 42 సంవత్సరాల పాటు నెలకు రూ. 210 చెల్లించాలి. అంటే రోజుకు రూ.7 అంతే.

భార్యాభర్తలిద్దరూ కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే నెలకు రూ.420 చొప్పున పెడుతూ రావాలి. 60 ఏళ్లు నిండాక మొత్తం నెలకు రూ.10 వేల చొప్పున పెన్షన్ మీకు వస్తుంది. ఈ ఖాతా కోసం మీరు పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి తెరవచ్చు. ఆధార్ కార్డు, వాలిడేట్ మొబైల్ నంబరు ఉండాలి. నెలకి మీరు రూ.5 వేలు పెన్షన్ పొందాలంటే పద్దెనిమిదేళ్ల వాళ్ళు 42 సంవత్సరాల పాటు నెలకు రూ.210 చొప్పున ఈ స్కీమ్ లో పెట్టాలి. 60 సంవత్సరాలు వచ్చే వరకు నెలకు రూ.1454 కట్టాలి.

Read more RELATED
Recommended to you

Latest news