దేశీయ అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో చాలా మంది డబ్బులని పెడుతున్నారు. అయితే నిజానికి లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందిస్తున్న పాలసీల్లో డబ్బులని పెట్టడం వలన సూపర్ బెనిఫిట్స్ ని పొందవచ్చు. ఎల్‌ఐసీ తన కస్టమర్లకు ఎప్పటికప్పుడు అద్భుత పథకాలను తీసుకు వస్తూనే వుంది.అన్ని వర్గాల వారికి ఉపయుక్తంగా ఉండే అనేక పథకాలను లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకు వచ్చింది.
అయితే వాటిల్లో ఎల్‌ఐసీ జీవన్ లాభ్ పాలసీ ఒకటి. పాలసీదారులు బీమా రక్షణతో పాటు పొదుపు ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఒకవేళ కనుక అనుకోని సందర్భాల్లో పాలసీ హోల్డర్ చనిపోతే నామినీకి డెత్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇక మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు లోకి వెళితే.. ఐదు, పది, పదిహేను సంవత్సరాల వ్యవధితో ఈ పాలసీ తీసుకోచ్చు. రూ. 5లక్షలతో పాలసీ తీసుకోవాల్సి వుంది. ఈ ప్లాన్ లో మీరు ప్రీమియంలు నెల నెలా కట్టొచ్చు. ఇందులో మీరు కట్టిన ప్రీమియంపై లోన్ సదుపాయాన్ని కూడా పొందొచ్చు. జీవన్ లాభ్ పథకం ద్వారా డెత్ బెనిఫిట్ ఉంటుంది.
మెచ్యూరిటీ తర్వాత పూర్తి మొత్తాన్ని పొందవచ్చు. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా మీకు ఉంటాయి. పాలసీదారులు ఐదు రకాల ఆప్షనల్ రైడర్ ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ పాలసీని తీసుకోవాలి అంటే వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయస్సు 59 ఏళ్లు. జీవన్ లాభ్‌లో 25 ఏళ్ల వయస్సులో నమోదు చేసుకుంటే నెలకి రూ. 7,572 లేదా రూ. రోజుకు 252 ప్రీమియంగా కట్టాల్సి వుంది. మెచ్యూరిటీ సమయంలో వారు రూ. 54 లక్షలు వస్తాయి. చెల్లించాల్సిన వార్షిక ప్రీమియం రూ. 90,867గా ఉంటుంది.