బీజేపీకి ఈటల రాజేందర్ రాజీనామా చేయనున్నట్లు.. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరతారని వార్తలు వస్తున్నాయి. అయితే.. దీనిపై స్వయంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజీనామా..క్లారిటీ ఇచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోం మంత్రి అమిత్ షా గార్ల నాయకత్వంలో ఒక సైనికుడిలా పని చేస్తున్నానని తెలిపారు.
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు కేసీఆర్ నియంతృత్వ పాలన అంతమొందిచడమే నా లక్ష్యం. అది బీజేపీ ద్వారానే సాధ్యం అవుతుంది అని నమ్మినవాడిని. బీజేపీ జెండా తెలంగాణ గడ్డ మీద ఎగురవేయడం కోసం అనుక్షణం అలుపెరగని పోరాటం చేస్తున్న. బీజేపీ నాయకుల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. పార్టీ మార్పుపై పత్రికల్లో వచ్చిన వార్తను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. నేను పార్టీలు మార్చే వ్యక్తిని కాదు. మా అభిప్రాయం తెలుసుకోకుండా ఇలాంటి వార్తలు రాయడం తగదని హెచ్చరించారు ఈటల రాజేందర్.