దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనాగుతూనే ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జినోపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. అలాంటి వారికీ అండగా నిలవడానికి కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అమలులోకి తీసుకొచ్చింది. తాజాగా స్టేట్ బ్యాంక్ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇక డెబిట్ కార్డు ఉపయోగించే వారి కోసం ఎస్‌బీఐ ఈజీ ఈఎంఐ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపింది..
తాజాగా ఎస్‌బీఐ ఆన్‌లైన్ షాపింగ్, ఆఫ్‌లైన్ షాపింగ్ చేసే వారికి ప్రయోజనం కలిగే నిర్ణయం వెల్లడించింది. దీంతో పండుగ సీజన్‌లో షాపింగ్ చేయాలని ప్లాన్ చేసుకునే వారికి ఊరట కలుగనుందని తెలిపారు. ఇక స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డు ఉపయోగించే వారి కోసం బ్యాంక్ తాజాగా సులభమైన ఈఎంఐ ఆప్షన్ ప్రకటించింది. షాపింగ్ చేసిన మొత్తాన్ని ఈజీగానే ఈఎంఐ రూపంలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు లేకపోయినా పర్లేదు. షాపింగ్ చేయొచ్చునని తెలిపారు.
ఇక షాపుల్లో పీఓఎస్ మెషీన్లు, ఈకామర్స్ వెబ్‌సైట్లలో డెబిట్ కార్డుపై ఈఎంఐ ఆఫర్ పొందొచ్చని స్టేట్ బ్యాంక్ తెలియజేసింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సైట్లలో పండుగ సేల్స్ అందుబాటులో ఉన్న విషయం అందరికి తెలిసిందే. వీటిల్లో నచ్చిన ప్రొడక్టును కొనుగోలు చేసి ఈజీ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చునని బ్యాంకు యాజమాన్యం తెలిపింది.
అంతేకాదు ఇక్కడ డెబిట్ కార్డు ఈఎంఐ ఆప్షన్ అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చునని వెల్లడించారు. ప్రిఅప్రూవ్డ్ కస్టమర్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపారు. రూ.లక్ష వరకు లోన్ అకౌంట్ పొందొచ్చునన్నారు. ఉపయోగించిన మొత్తాన్ని 6, 9, 12, 18 నెలలలోపు తిరిగి చెల్లించొచ్చునని తెలిపారు. ఈ తరహా రుణాలపై రెండేళ్ల ఎంసీఎల్ఆర్‌కు అదనంగా 7.5 శాతం వడ్డీ పడుతుందన్నారు. జీరో ప్రాసెసింగ్ ఫీజు బెనిఫిట్ ఉందన్నారు. ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదని తెలిపారు. మీరు కూడా మీ కార్డుపై ఈ ఆఫర్ ఉందో లేదో ముందే తెలుసుకోవచ్చునన్నారు. దీనికి 567676 నెంబర్‌కు డీసీఈఎంఐ అని టైప్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి మెసేజ్ పంపాలని బ్యాంకు యాజమాన్యం తెలిపారు.