ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వైరల్‌ అవుతున్న పోస్టింగ్స్‌…!

-

ఏ పని కావాలన్నా.. ఆయా నియోజకవర్గాల జనం ఎమ్మెల్యే ఇంటికెళ్లి మొరపెట్టుకునేవారు. కాదూ కూడదు అంటే.. నాలుగైదుసార్లు తిరిగేవారు. కానీ.. ఇప్పుడు ట్రెండ్‌ మార్చేశారు జనం. తమ ఎమ్మెల్యేను ఏదైనా అడగాలన్నా.. కడిగేయాలన్నా సోషల్‌ మీడియాను విచ్చల విడిగా వాడేస్తున్నారట. ఇలాంటి పోస్ట్‌లు చాలా వేగంగా వైరల్‌ అవుతుండటంతో ఎమ్మెల్యేలకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయని సమాచారం.

ఇదే సమయంలో ఎమ్మెల్యేల అనుచరులు తమ నేతను ఇంత కాదు.. అంత అంటూ పొగుడుతూ పోస్టులు పెడుతుంటే.. వీటికి పోటీగా జనాలు పెడుతున్న కామెంట్స్‌ మరింతగా షికారు చేస్తున్నాయట. ఈ విషయంలో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లను ఓ రేంజ్‌లో వాడేసుకుంటున్నారు. పైగా గ్రూపులుగా మారి పోస్టులతోనే మాటల తూటాలు పేల్చేస్తున్నట్టు చెవులు కొరుక్కుంటున్నారు.

నియోజకవర్గం అభివృద్ధిపై చక్కగా డిజైన్‌ చేసిన పోస్టులను కొందరు ఎమ్మెల్యేలు సోషల్‌ మీడియాలో పెట్టిస్తుంటే.. దానికి ఉల్టా పంచ్‌లు వేస్తున్నారు మరికొందరు. దీంతో సోషల్‌ మీడియాలో ప్రచారం కంటే.. ప్రమాదమే ఎక్కువ ఉందని భావించిన ఓ ఆదిలాబాద్ ఎమ్మెల్యే.. దాని జోలికి వెళ్లొద్దని అనుచరులకు చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలోని అధికార పార్టీలోని ఎమ్మెల్యేలలో చాలామంది సోషల్‌ మీడియా అంటేనే ఉలిక్కి పడుతున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news