ఈ మధ్య కాలం లో చాలా మంది నచ్చిన స్కీమ్స్ లో డబ్బులని పెడుతూ వుంటారు. ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ ఎన్నో స్కీమ్స్ ని అందిస్తోంది. పోస్ట్ ఆఫీస్ అందించే స్కీమ్స్ తో చక్కటి లాభాలని పొందొచ్చు. పోస్టాఫీసు సేవింగ్ పథకాలకు ఈ మధ్యన ఆదరణ వీటికి విపరీతంగా పెరుగుతోంది. పోస్ట్ ఆఫీస్ అందించే వాటిలో చాలా రకాల ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ ఉన్నాయి.
ఇవి పూర్తిగా సేఫ్ ఏ. సీనియర్ సిటిజన్లకు ముఖ్యంగా పోస్టాఫీసులో చాలా స్కీమ్స్ వున్నాయి. పైగా వాటి వడ్డీ రేటు కూడా చాలా ఎక్కువ. సీనియర్ సిటిజన్ల కోసం రిటైర్మెంట్ తరవాత ఆర్ధిక భరోసా ఇచ్చేందుకు వివిధ రకాల పథకాలు పోస్టాఫీసులు తీసుకొచ్చాయి. ఈ స్కీమ్స్ లో సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ కూడా ముఖ్యమైనది. ఇక దాని వివరాలని చూసేద్దాం.
1000 రూపాయలతో ప్రారంభించి గరిష్టంగా 15 లక్షల వరకూ ఈ స్కీమ్ లో పెట్టచ్చు. అలానే ఈ స్కీమ్ కాల పరిమితి 5 ఏళ్లకు ఉంటుంది. ఈ స్కీమ్ కింద 8 శాతం వడ్డీ వస్తుంది. ఈ స్కీమ్ 60 ఏళ్లు దాటిన వారికి వర్తిస్తుంది. ప్రతి మూడు నెలలకు వడ్డీ రేట్లను మారుస్తుంది ప్రభుత్వం. జనవరి-మార్చ్ త్రైమాసికంలో సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ వడ్డీను 8 శాతం కి మార్చింది. మార్చ్ 31 2023 వరకూ దీని లిమిట్ 15 లక్షలుంది. ఈ స్కీమ్ కాల పరిమితి ఐదేళ్లు. 3 ఏళ్లు పెంచుకోవచ్చు. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి