కొత్త పాన్ కార్డు కావాలా..? అయితే వెంటనే ఇలా చెయ్యండి..!

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో పాన్ కార్డు కూడా ఒకటి. పాన్ కార్డు వలన చాలా లాభాలు వున్నాయి. ఆర్థిక లావాదేవీలు జరిపే ప్రతీ ఒక్కరికీ కూడా పాన్ కార్డు అవసరమే. 10 డిజిట్స్ గల పర్మనెంట్ అకౌంట్ నెంబర్ కొన్ని ట్రాన్సక్షన్స్ కి ముఖ్యం. ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేయడం, పన్నులకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ని గుర్తించేందుకు ఇలా పాన్ కార్డు అన్నింటికీ కూడా అవసరమే. ఒకవేళ కనుక పాన్ కార్డు లేక పోతే ఎక్కడైనా పాన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటే వెంటనే దరఖాస్తు చేస్తూ ఉంటారు.

పాన్ కార్డు ని ఇప్పుడు ఆన్‌లైన్‌ లోనే అప్లై చేసి పాన్ కార్డ్ ని పొందొచ్చు. కొత్త పాన్ కార్డ్ మాత్రమే కాదు. ఇప్పటికే ఉన్న పాన్ కార్డు లో ఏవైనా వివరాలు అప్‌డేట్ చేయాలన్నా కూడా ఈజీగానే ఆన్ లైన్ లో చెయ్యచ్చు. ఆన్‌లైన్‌లోనే పాన్ కార్డు కోసం ఎన్ఎస్‌డీఎల్ లేదా యూటీఐటీఎస్ఎల్ పోర్టల్‌లో దరఖాస్తు చెయ్యచ్చు. ఇక ఆన్‌లైన్‌లో పాన్ కార్డు కి ఎలా అప్లై చేయాలో చూద్దాం.

ముందుగా https://tin.tin.nsdl.com/pan/index.html లేదా https://www.pan.utiitsl.com/PAN/ వెబ్‌సైట్ కి వెళ్ళండి. ఇప్పుడు అప్లికేషన్ టైప్‌లో ఇండియన్ సిటిజన్, ఫారిన్ సిటిజన్ ఆప్షన్స్ ఉంటాయి. అందులో సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు కేటగిరీ సెలెక్ట్ చేయాలి. ఆ తరవాత పేరు, పుట్టిన తేదీ, జెండర్, అడ్రస్, కాంటాక్ట్ నెంబర్, ఇమెయిల్ ఐడీ వంటి వివరాలు ఇచ్చేయండి. ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాల్సి వుంది.

పాన్ కార్డ్ అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఫామ్ సబ్మిట్ చేసాక.. అక్నాలెడ్జ్‌మెంట్ రిసిప్ట్ ప్రింట్ తీసుకోండి. అక్నాలెడ్జ్‌మెంట్ రిసిప్ట్ పైన సంతకం పెట్టి రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అప్‌లోడ్ చేసేయండి. అప్లికేషన్ ఫామ్, డాక్యుమెంట్స్ ని NSDL లేదా UTIITSL అడ్రస్‌కు పంపాల్సి వుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news