‘తీస్ మార్ ఖాన్’గా ఆది సాయి కుమార్ వచ్చేస్తున్నాడు..

-

టాలీవుడ్ సీనియర్ హీరో సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ ..ఈ సారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ..‘తీస్ మార్ ఖాన్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. ఆది సాయి కుమార్ గత చిత్రాలు అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందలేదు. ఈ నేపథ్యంలో ఈ సారి డెఫినెట్ గా హిట్ అందుకోవాలనే లక్ష్యంతో కాన్ఫిడెంట్ గా వస్తున్నాడు.

కొవిడ్ నేపథ్యంలో ఈ చిత్ర విడుదల వరుసగా వాయిదాలు పడుతూ వచ్చింది. వచ్చే నెల 27న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ క్రమంలోనే చిత్ర అప్ డేట్స్ ఒక్కొక్కటి మేకర్స్ ఇచ్చేస్తున్నారు. యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో ఆదిసాయికుమార్ కు జోడీగా బోల్డ్ బ్యూటీ RX 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్ నటించింది.

కల్యాణ్ జీ గోగన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ టీజర్ ను ఈ నెల 18న ఉదయం 11.43 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. విజన్ సినిమాస్ బ్యానర్ పై ఈ పిక్చర్ ను నాగం తిరుపతిరెడ్డి ప్రొడ్యూస్ చేశారు. సునీల్, పూర్ణ, కబీర్ దుహాన్ సింగ్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news