కాలేయ సమస్యలని దూరం పెట్టే ఆహారాలు.. ఇప్పుడే తెలుసుకోండి..

-

ఈ మధ్య కాలంలో ఫ్యాటీ లివర్ సమస్యలు ఎక్కువ మందిని వేధిస్తున్నాయి. కాలేయానికి కొవ్వు పట్టి అసాధారణంగా మారడమే ఫ్యాటీ లివర్. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. వాటన్నింటి గురించి పక్కన పెడితే, ప్రస్తుతం కాలేయం ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు కొన్ని ఆహారాలు బాగా ఉపయోగపడతాయి. కాలేయ పనితీరును వృద్ధి చేసే ఈ ఆహారాలని మీ దినచర్యలో భాగం చేసుకుంటున్నారా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి.

ఉసిరి

విటమిన్ సి మూలం ఉసిరి. సిట్రస్ ఫలం. శరీరంలోని విష పదార్థాలను బయటకి పంపించివేసే ఆహారం. దీన్ని సాధారణంగా గానీ ఊరగాయ రూపంలో గానీ తీసుకోవచ్చు. యాంటీఆక్సిడెంట్లు అధికంగా గల ఉసిరి కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.

వెల్లుల్లి

సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఈ కారణంగా శరీరంలోని విష పదార్థాలను బయటకి పంపివేస్తుంది. వంటల్లో తరచుగా ఉపయోగించే అద్భుత ఆహారం.

పసుపు

యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు అధికంగా గల పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది. భారతదేశ వంటకాల్లో పసుపు స్థానం ప్రత్యేకం. కాలేయ సమస్యలను దూరం పెట్టడంతో పాటు పిత్తాశయం పనితీరున్ను మెరుగుపరుస్తుంది. ఇందులోని కర్క్యుమిన్ శరీరానికి బాగా ఉపయోగపడుతుంది. ప్రతీరోజూ రాత్రి పాలలో పసుపు వేసుకుని తాగితే అద్భుతమైన ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.

మజ్జిగ

మధ్యాహ్నం పూట మజ్జిగలో కాసింత ఉప్పు, కాల్చిన జీలకర్ర వేసుకుని తాగితే చాలా మంచిది. ఇది జీర్ణాశయం పనితీరును మెరుగుపరిచి ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది.

గ్రీన్ టీ

గ్రీన్ టీలోని సమ్మేళనాలు కాలేయ మంటను తగ్గించడానికి సాయపడతాయి.

Read more RELATED
Recommended to you

Latest news