బంగారం కొనేవాళ్లకు గుడ్‌న్యూస్.. రేట్స్ ఇవే!

హైదరాబాద్: బంగారం, వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు రూ. 49,640 ఉండగా శుక్రవారం రూ. 50,400 ఉంది. ఒక్క రోజులో రూ. 760 తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు రూ. 45,500 కాగా శుక్రవారం 46,200 ఉంది. ఒక్క రోజులో రూ.700 తగ్గింది. గ్లోబల్ మార్కెట్‌లో‌ అంతర్జాతీయంగా ఏర్పడిన కారణాల వల్ల బంగారం ధరలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. సోమవారం తర్వాత బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక వెండి ధరలు కూడా తగ్గాయి. ఇవాళ హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.75,500 ఉండగా.. శుక్రవారం రూ. 77,500 ఉంది. ఒక్క రోజులో రూ. 2000 తగ్గింది. కాగా వెండి ధరలు 10 రోజుల్లో 4 సార్లు తగ్గడం విశేషం.