ఉమాంగ్ యాప్ తో ఈ నాలుగు ఆధార్ సేవలను పొందొచ్చు..!

-

ఉమాంగ్ యాప్ వలన చాలా ప్రయోజనాలు మనం పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు చెందిన సర్వీసులను ఈ ఉమాంగ్ యాప్ ద్వారా అందిస్తూ వుంటారు. ఎన్నో రకాల సేవలను మనం పొందుతూ ఉంటాం.

అలానే ఆధార్‌కు సంబంధించిన సర్వీసులను కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. పూర్తి వివరాలను చూస్తే.. తాజాగా ఉమాంగ్ యాప్ తన అధికారిక ట్విటర్ అకౌంట్‌లో ఈ నాలుగు ఆధార్ సర్వీసులను ఇస్తున్నట్టు తెలిపింది. ఉమాంగ్ యాప్‌పై ఉన్న ఆధార్‌కి సరికొత్త సిటిజన్ సెంట్రిక్ సర్వీసులను యాడ్ చేసారు. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ని పొందాలంటే ఉమాంగ్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు లేదా 97183-97183కి మిస్డ్ కాల్ ఇవ్వచ్చు అని ట్వీట్ చేసారు.

ఉమాంగ్ యాప్ తో ఈ ఆధార్ సర్వీసులను పొందొచ్చు:

ఆధార్ స్టేటస్‌ను చెక్ చేసుకునేందుకు ఉమాంగ్ యాప్ ని ఉపయోగించచ్చు.
అలానే ఆధార్‌తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ని కానీ ఈమెయిల్‌ను కానీ వెరిఫై చేసుకో వచ్చు.
ఎన్‌రోల్‌మెంట్ లేదా అప్‌డేట్ రిక్వెస్ట్ స్టేటస్‌ ఈ యాప్ తో తెలుసుకో వచ్చు.
ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, ఆధార్ నెంబర్‌ను పొందొచ్చు.

మొదట యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. లాగిన్ అయ్యి.. ‘MY Aadhaar’పైన క్లిక్ చేసేయండి.
మీ ఆధార్‌ను లింక్ చేసుకోవాలని మీకు రిక్వెస్ట్ వస్తుంది.
నెక్స్ట్ ఆధార్ నెంబర్‌, క్యాప్చా ఎంటర్ చేసి ఓటీపీపై నొక్కండి.
ఓటీపీ ఎంటర్ చేసాక ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మిగిలిన సర్వీసులూ పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news