నాగబాబు కొత్త షో.. క్లారిటీ ఇచ్చిన గెటప్ శీను..?

జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మెగా బ్రదర్ నాగబాబు సరికొత్త ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జీ తెలుగులో అదిరింది అనే షోలో జడ్జిగా చేస్తున్నారు. అయితే ఇటీవలే టాలెంట్ వున్న కొత్త కమెడియన్స్ ను ఎంకరేజ్ చేసేందుకు నాగబాబు డిజిటల్ మీడియా వేదికగా రెండు కొత్త షో లను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో ఒకటి స్టాండప్ కామెడీ షో కాగా… మరొకటి ప్రస్తుతం జీ తెలుగు లో నాగబాబు జడ్జిగా వ్యవహరిస్తున్న అదిరింది లాంటి స్కిట్ షో. అయితే ఇందులో స్టాండప్ కామెడీ షో కి సంబంధించి జబర్దస్త్ కమెడియన్ బుల్లెట్ భాస్కర్ పలు వివరాలు తెలపారు.

మరో కామెడీ షో కి జబర్దస్త్ కమెడియన్ గెటప్ శీను పలు వివరాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. స్కిట్స్ తో కూడిన షో పేరు విజిల్ అని తెలిపిన గెటప్ శీను… ఈ షోలో అవకాశం దక్కించుకోవడానికి ఏం చేయాలో అనే వివరాలను కూడా వెల్లడించారు…. ఎంపికైన వారికి ప్రోత్సాహకాలు లాంటి విషయాలను కూడా వెల్లడించారు గెటప్ శ్రీను. నాగబాబు హయాంలో 6 టీమ్స్ సెలెక్షన్ చేసి వాటిని ఫైనల్ చేయనున్నట్లు శ్రీను చెప్పుకొచ్చారు. షో లో కొత్త వారితో పాటు ఇప్పటికే పాపులర్ అయిన కమెడియన్స్ కూడా పాల్గొనే అవకాశం ఉందని.. ఆసక్తి కలవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.