Jabardasth : రెండో పెళ్లి చేసుకున్న “గెటప్ శ్రీను”.. ఫోటోలు వైరల్ !

-

బుల్లితెర ప్రేక్షకులకు గెటప్ శ్రీను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ షో లో గెటప్ శ్రీను వేసే పాత్రలు, చేసే నటన అందరినీ కట్టిపడేస్తుంది. బుల్లితెరపై తన సత్తాను చాటిన గెటప్ శ్రీను… వెండితెరపై కమెడియన్ గా కూడా దూసుకుపోతున్నారు. వరస ప్రాజెక్టులతో ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు గెటప్ శ్రీను.

మెగాస్టార్ నటించిన ఆచార్య లాంటి భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నాడు. దాదాపు ఇప్పుడు అర్జెంట్ సినిమా లో గెటప్ శ్రీను ఫుల్ స్పీడ్ లో ఉన్నారు. అయితే తాజాగా పెళ్లి పీటల పై కూర్చున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు గెటప్ శీను. ప్రస్తుతం గెటప్ శ్రీను రాజు యాదవ్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో గెటప్ శ్రీనునె హీరో.

అయితే ఈ సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ షూటింగ్ ఇవాళ జరిగింది. అయితే చివరి షెడ్యూల్ లో గెటప్ శ్రీను పెళ్ళికొడుకు గెటప్ లో కనిపించాడు. వాటికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు గెటప్ శ్రీను రెండో పెళ్లి చేసుకున్నాడా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news