ఈరోజు జీహెచ్ఎంసిలో కొత్త పాలకవర్గం కొలువు తీరనుంది. ముందుగా కొత్తగా ఎన్నికయిన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. అయితే ప్రమాణ స్వీకారం చేయడానికి కొత్త పాలక మండలి భయపడుతున్నట్టు చెబుతున్నారు. ఎందుకంటే కరోనా టెస్టులు చేయకుండానే ప్రమాణ స్వీకారానికి పిలిచారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిల్ హాల్ లో ఫిజికల్ డిస్టాన్స్ లేదని చెబుతున్నారు. ఇప్పటికే కరోనాతో లింగోజి గూడ కార్పొరేటర్ చనిపోయిన నేపధ్హ్యంలో అందరిలో టెన్షన్ నెలకొంది.
కౌన్సిల్ హాల్ లో కార్పొరేటర్ లతో పాటు, అధికారులు.. ఎన్నికల సిబ్బంది మొత్తం 250 మంది ఒకే హాల్ లో ఉండాల్సి ఉందని అంటున్నారు. ఇక హైదరాబాద్ మేయర్ అభ్యర్థిగా కేకే కూతురు గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా మోతె శ్రీలత శోభన్‌రెడ్డి దాదాపు ఖరారయ్యారు. బంజారాహిల్స్ కార్పొరేటర్‌గా విజయలక్ష్మి రెండోసారి గెలవగా… మోతె శ్రీలత శోభన్‌రెడ్డి తార్నాక కార్పొరేటర్‌గా తొలిసారి గెలిచారు.