బ్రేకింగ్ : డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ పోలింగ్ ?

-

గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ ఇచ్చేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. మరి కాసేపట్లో దానికి సంబంధించిన ప్రకటన చేయనున్నారు ఎన్నికల కమిషనర్. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈరోజే నోటిఫికేషన్ విడుదల చేసి, నామినేషన్లు కూడా ప్రారంభిస్తారని అంటున్నారు. ఇక అన్డుహ్తున్న సమాచారం మేరకు డిసెంబర్ 1న బల్దియా ఎన్నికల  పోలింగ్ ఉండనుండగా 4న కౌంటింగ్ ఉండే అవకాశం ఉంది.

ఈ మేరకు నేడు 10.30కు ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు నుండి మొదలు కానున్న నామినేషన్లకు నవంబర్ 20న చివరి రోజు అని చెబుతున్నారు. 21న పరిశీలన ఉంటుందని, 24న ఉపసంహరణ ఉంటుందని చెబుతున్నారు. డిసెంబర్ 1న పోలింగ్ ఉండనుండగా 3న అవసరమైతే రీ పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఇక 4న ఓట్ల లెక్కింపు అదే రోజు ఫలితాలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news