హైదరాబాద్ మెట్రోపాలిటిన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలోని కీలక ప్రాంతాలన్నీ మహా బల్దియా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోకి రానున్నాయి. దాదాపు 50 గ్రామాలు జీహెచ్ఎంసీలో కలవనున్నాయి. ప్రస్తుతం హెచ్ఎండీఏ విస్తరిత ప్రాంత విస్తీర్ణం 7,200 చదరపు కిలోమీటర్లు. దాదాపు 841 గ్రామాలు హెచ్ఎండీఏ కింద ఉన్నాయి.
ఆయా ప్రాంతాలన్నీ ఇక నుంచి జీహెచ్ఎంసీ కిందకు రానున్నాయి. దీంతో హెచ్ఎండీఏ విస్తీర్ణం 5,872 చదరపు కిలోమీటర్లకు పరిమితం కానుంది.తొలుత నగరపరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ప్రభుత్వం భావించగా..కానీ, ఏమైందో తెలీదు ఆ ప్రతిపాదనను ప్రభుత్వం ఒక్కసారిగా విరమించుకుంది.కానీ, గ్రామాలను విలీనం చేయాలని నిర్ణయం తీసుకుంది.