కొద్ది సేపటి క్రితం గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. ఈ ఎన్నికలకు గాను మూడు కమిషనరేట్ల పరిధిలో 52 వేల మంది తో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్టమైన చర్యలు చేపట్టారు పోలీసులు. సీసీటీవీ కెమెరాల తో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి సోషల్ మీడియా పై ప్రత్యేక దృష్టి సారించారు పోలీసులు. 2336 సున్నితమైన పోలింగ్ స్టేషన్స్ గా గుర్తించారు. 1207 అతి సున్నితమైన పోలింగ్ స్టేషన్స్ గా గుర్తించారు.
279 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ గా గుర్తించారు ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ఇద్దరు పోలీస్ లు ఉంటారని, 2272 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ క్యాస్ట్ ఉంటుందని చెబుతున్నారు. ఇక ఈ ఎన్నికలకు గాను 1729 సూక్ష్మ పరిశీలకులు ఉండనున్నారు. 5095 వీడియో గ్రాఫి టీమ్స్..తో పాటు పోలీస్ లు పని చేస్తున్నారు. 7 గంటలకు మొదలయిన ఈ పోలింగ్ సాయంత్రం 6 వరకు జరగనుంది.