BREAKING : కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మహిళలు మృతి

-

దేశంలో రోజు రోజు కు రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన రూల్స్‌ పెట్టినా.. అతివేగం కారణంగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా… కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కరీంనగర్‌ పట్టణంలోని… కమాన్ చౌరస్తా నుండి హైదరాబాద్ వెళ్లే రోడ్డు పక్కనే ఉన్న సీసా కమ్మరోళ్లపైకి దూసుకెళ్లింది కారు.

accident

దీంతో ఆ కారులో ఉన్నటు వంటి నలుగురు మహిళలు మృతి అక్కడి క్కడే మృతి చెందారు. అలాగే ఆ కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అలెర్ట్‌ అయి.. వారిని స్థానిక ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు డ్రైవర్‌ అతి వేగం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version