టీవీలు, వార్తా పత్రికలు, ఇతర పలు చోట్ల మనం నిత్యం అనేక కంపెనీలకు చెందిన ప్రకటనలను చూస్తుంటాం. మా ప్రొడక్ట్ చాలా బాగుంటుందని ఒక కంపెనీ యాడ్ ఇస్తుంది. ఇంకో కంపెనీ చక్కని సర్వీస్ ఇస్తామని చెబుతుంది. అయితే ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ ప్రొడక్ట్స్ విషయానికి వస్తే కంపెనీలు రుజువులతోనే యాడ్స్ ను ప్రసారం చేయాలి. ప్రచురించాలి. రుజువులు లేకుండా యాడ్స్‌ను ప్రసారం చేస్తే అలాంటి కంపెనీలపై చర్యలు తీసుకుంటారు.
మా ప్రొడక్ట్ ను వాడితే 100 శాతం రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.. ఏదైనా కంపెనీ యాడ్ ఇచ్చిందనుకోండి, దానికి సైంటిఫిక్‌గా రుజువులు ఉండాలి. అలా లేకుండా యాడ్స్ ఇవ్వరాదు. ఇస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. అలాంటి తప్పుడు యాడ్‌లను ఇచ్చే కంపెనీలపై రూ.10 లక్షల జరిమానాతోపాటు యజమానులకు 2 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఈ మేరకు సెంట్రల్ కన్‌జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) కంపెనీలకు సూచించింది.
కరోనా నేపథ్యంలో ప్రస్తుతం అనేక కంపెనీలు తమ శానిటైజర్లను, ఇతర ఉత్పత్తులను అమ్ముతున్నాయి. నకిలీ ఉత్పత్తులకు కూడా యాడ్స్ ఇచ్చి వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తూ ఉత్పత్తులను అమ్ముతున్నారు. అందువల్లే సీసీపీఏ ఆ ప్రకటన చేసింది. తప్పుడు ప్రకటనలు చేసే కంపెనీలపై చర్యలు తీసుకుంటామని తెలిపింది.