రెయిన్ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తున్న మత్స్యకన్య.. ఎక్కడంటే?

-

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో విక్టరీ వెంకటేశ్, బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి జంటగా నటించిన ‘సాహస వీరుడు సాగర కన్య’ చిత్రంలో శిల్పాశెట్టి పోషించిన పాత్ర దాదాపు అందరికీ నచ్చే ఉంటుంది. మత్స్యకన్యగా శిల్ప యాక్టింగ్ ప్లస్ పర్ఫార్మెన్స్ చూసి జనాలు అప్పట్లో ఫిదా అయ్యారు. ఇప్పటికీ ఆ చిత్రం ఎవర్ గ్రీన్ అనే చెప్తుంటారు సినీ పరిశీలకులు. ఇప్పుడు ఇదంతా చర్చ ఎందుకంటే.. మత్స్య‌కన్య గురించి.. సాగర కన్య కేవలం సినిమాలోనే ఉంటుందని అనుకుంటే మీరు పొరపడినట్లే..నిజంగానే రియల్ లైఫ్‌లో మత్స్యకన్య ఉంటుందని చాలా సార్లు కొందరు పేర్కొన్నారు. తాజాగా స్కాట్లాండ్‌ దేశంలోని గ్లాస్గోలో వరదనీటిలో జలకన్య కనిపించింది. ఆ ప్రదేశంలో రెయిన్ వాటర్‌లో మత్స్యకన్య హాయిగా స్విమ్ చేస్తోంది. కాగా, ఆమె స్విమ్ చేస్తున్న దృశ్యాలను చూసి ఆశ్చర్యపోయిన గావిన్ మిల్లర్ అనే వ్యక్తి సదరు కన్యను ఫొటోలు తీశాడు.

వాటని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే, ఫొటోను నిశితంగా గమనిస్తే మీకు సాగర కన్య కనిపిస్తుంది. కానీ, ఆమె నిజమైన సాగర కన్య కాదని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కేవలం
కాస్ట్యూమ్స్ ధరించి అలా హ్యాపీగా ఓ యువతి ఎంజాయ్ చేసిందని ఆ ప్రాంతవాసులు పేర్కొంటున్నారు.
అయితే, నిజమైన సాగర కన్యలు భూమ్మీదకు వచ్చి ఉన్నట్లు పరిశోధకులు, శాస్త్రవేత్తలు గతంలో పేర్కొన్నారు. కానీ, స్కాట్లాండ్‌లో లేరోమోనని కొందరు నెటిజన్లు చెప్తున్నారు. మొత్తంగా సరదాగా ఓ యువతి చేసిన పని ఇంటర్నెట్‌లో ఓ చర్చతో పాటు వైరల్ ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వ్యక్తి కూడా తొలుత యువతి నిజంగానే సాగర కన్యనా? అని అనుమానించినట్లుగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news