టోక్యో ఒలింపిక్స్.. లిఫ్ట్ పై జపనీస్ ఓన్లీ అన్న బోర్డు.. సోషల్ మీడియాలో వైరల్.. ఏం జరిగిందటే?

-

టోక్యోలో ఒలింపిక్ ( Tokyo Olympics )  గేమ్స్ నిర్వహించడానికి సన్నాహకాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 23వ తేదీ నుండి టీక్యో వేదికగా ఒలింపిక్ గేమ్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల నుండి ఆటగాళ్ళందరూ టోక్యో చేరుకుంటున్నారు. ఇప్పటికే జపాన్ లో కోవిడ్ ఎమర్జెన్సీ విధించారు. అటు ఒలింపిక్ గేమ్స్, ఇటు కరోనా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, ప్రేక్షకులను అనుమతి కూడా ఇవ్వడం లేదు. కేవలం నిర్వాహకులు మాత్రమే ఉండనున్నారు. ఐతే తాజాగా జపాన్ లో జరిగిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

టోక్యో ఒలింపిక్స్ | Tokyo Olympics
టోక్యో ఒలింపిక్స్ | Tokyo Olympics

టోక్యో ఒలింపిక్స్ గేమ్స్ కారణంగా వివిధ దేశాల నుండి ఆటగాళ్ళకు ప్రత్యేక లిఫ్ట్ ఏర్పాటు చేసింది. అంటే ఒక లిఫ్ట్ లో కేవలం విదేశీ ఆటగాళ్ళే వెళ్ళాలన్నట్టు ” ఓన్లీ ఫారెనర్స్” అని, మరో లిఫ్ట్ లో ఓన్లీ జపనీస్ అని బోర్డు పెట్టింది. కరోనా పరిస్థితులు ఉన్నాయన్న నేపథ్యంలో ఇలాంటి సైన్ బోర్డు పెట్టిన జపాన్ కి చెందిన హొటల్, ప్రస్తుతం చిక్కుల్లో ఇరుక్కుంది. ఇలా సైన్ బోర్డులు పెట్టి వేరు చేయడం జాత్యహంకారం అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

దేశానికి వచ్చిన అతిధులను ఇలా వేరు చేసి చూస్తారా అంటూ విమర్శలు వచ్చాయి. దాంతో దిగి వచ్చిన హోటల్ నిర్వాహకులు, ఆ బోర్డును తీసేసారు. కరోనా కారణంగా అలాంటి బోర్డు పెట్టామే తప్ప అందులో ఎలాంటి దురుద్దేశం లేదని చెప్పుకొచ్చారు. జపాన్ లో కరోనా ప్రభావం బాగానే ఉంది. ఇప్పటి వరకు 8లక్షలకి పైగా కేసులు, 15వేలకి పైగా మరణాలు సంభవించాయి. జపాన్ రాజధాని అయిన టోక్యోలో ఈ ఆదివారం రోజున 614కొత్త కేసులు వచ్చాయి. వారం వారం లెక్కలు చూసుకుంటే ఇది పెరుగుతుందని జపాన్ ప్రభుత్వం వెల్లడి చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news