కిరాణా షాప్ ఇక నుంచి ఏటీఎంగా మారుతుంది… ఏ కార్డులు పని చేస్తాయి…?

-

ఏటీఎం లో డబ్బులు లేక ఇబ్బంది పడే వారి కోసం రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కొత్త సౌకర్యాన్ని తీసుకొచ్చింది. పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఎప్పటి నుంచో ఈ సదుపాయం ఉంది. అనేక అనుమానాలు ఉన్న నేపధ్యంలో వాటిని సవరించి… పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్‌లో క్యాష్ విత్‌డ్రాయల్ విధానాన్ని బ్యాంకు వివరించింది.

బ్యాంకులు జారీ చేసిన డెబిట్ కార్డులు, ఓపెన్ సిస్టమ్ ప్రీపెయిడ్ కార్డ్స్‌తో డబ్బులు డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. క్రెడిట్ కార్డులతో డబ్బులు డ్రా చేసుకోవడం కుదరదు. యూపీఐ ద్వారా కూడా పీఓఎస్ టెర్మినల్స్‌లో డబ్బులు డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం ఉన్న ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన అకౌంట్స్‌కు జారీ చేసిన ఎలక్ట్రానిక్ కార్డుల ద్వారా డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది.

పీఓఎస్ టెర్మినల్స్‌లో టైర్ 1, టైర్ 2 ప్రాంతాల్లో రోజుకు రూ.1,000, టైర్ 3, టైర్ 4 ప్రాంతాల్లో రోజుకు రూ.2,000 వరకు డ్రా చేసుకునే అవకాశం ఇచ్చింది. ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. గరిష్టంగా 1% వరకు ఉంటాయి. వెయ్యి విత్ డ్రా చేస్తే 10 రూపాయలు చెల్లించాలి. వ్యాపారులు దీనికి రిజిస్టర్ చేసుకోవాలి. ఏ కార్డ్ అయినా సరే డబ్బు తీసుకోవచ్చు. డ్రా చేస్తే మీకు రిసిప్ట్ ఇస్తారు. పీఓఎస్ టెర్మినల్స్‌లో డబ్బులు విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని Cash@pos పేరుతో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా అందిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news