దసరాకు మెగా బొనాంజా.. ‘గాడ్‌ఫాదర్’ సినిమా రిలీజ్

-

దసరాకు మెగా బొనాంజా సిద్ధమైంది. అభిమానులకు మెగా సర్‌ప్రైజ్ ఇవ్వడానికి చిరంజీవి సిద్ధమయ్యారు. గాడ్‌ఫాదర్ సినిమాను దసరాకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సల్మాన్ ఖాన్, చిరంజీవి కాంబినేషన్‌లో అదరగొట్టే సాంగ్ షూటింగ్ ముంబయిలో పూర్తయింది. ఈ సాంగ్‌తో సినిమా షూటింగ్ పూర్తైందని చిత్రబృందం ప్రకటించింది. ఇక విజయదశమికి థియేటర్లలో మెగా బాంబ్ పేలనున్నట్లు వెల్లడించింది.

సల్మాన్‌ఖాన్‌తో కలిసి చేసిన పాట కనుల పండుగలా ఉంటుందంటూ చిరంజీవి తెలిపారు. మలయాళంలో విజయవంతమైన ‘లూసిఫర్‌’కి రీమేక్‌గా వస్తోంది. నయనతార ముఖ్యభూమిక పోషిస్తున్నారు. బాలీవుడ్‌ కథానాయకుడు సల్మాన్‌ఖాన్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. సూపర్‌గుడ్‌ ఫిలింస్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ముంబయిలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తైనట్లు చిత్ర బృందం తెలిపింది. చిరంజీవి, సల్మాన్‌ఖాన్‌లపై ఓ పాటని తెరకెక్కించారు. దీనికి ప్రముఖ నృత్య దర్శకుడు ప్రభుదేవా నృత్యరీతులు సమకూర్చారు. సెట్లో సల్మాన్‌ఖాన్‌తో కలిసి కనిపిస్తున్న ఓ ఫొటోని ఇటీవలే సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు చిరంజీవి. ఈ చిత్రానికి తమన్‌ స్వరాలు అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news