Mega154 : మెగాస్టార్ వాల్తేరు వీరయ్యలో మరో సీనియర్ హీరోయిన్ !

-

ఆచార్య సినిమా తర్వాత మెగా స్టార్‌ చిరంజీవి.. తన ఫ్యాన్స్‌ కోసం వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి… మూడు సినిమాలను లైన్‌ లో పెట్టారు. అందులో ఒకటే మెగాస్టార్ 154 సినిమా. ఆ సినిమాకు వాల్తేరు వీరయ్య టైటిల్‌ పెట్టనున్నట్లు టాక్‌. ఇక ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ బాబి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ సినిమా మైత్రి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. అలాగే ఈ సినిమాకు టాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. ఇక ఈ సినిమా మాస్‌ మహారాజు రవితేజ కూడా నటిస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి సవతి తల్లి కొడుకుగా రవితేజ నటించనున్నారట. అంటే చిరంజీవి, రవితేజ ఇద్దరూ అన్నదమ్ములన్నమాట. అయితే..ఆ సవతి తల్లి పాత్రలో జయసుధ నటిస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news