గోదావరి ప్రాంతాన్ని కాలుష్య నివారణ ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ఏపీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన గోదావరి ఘట్స్ పరిశీలన కార్యక్రమం లో ముఖ్య అతిధిలుగా పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్, పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి. ఈ సందర్బంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గతంలో జరిగిన మూడు పుష్కరాలు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి.
పరిమిత వనరులుతో గోదావరి తీరాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. టెంపుల్ టూరిజం అభివృద్ధి దిశగా కార్యాచరణాలు రూపొందిస్తున్నాం. గోదావరి ప్రాంతాన్ని కాలుష్య నివారణ ప్రాంతంగా తీర్చిదిద్దే ఆలోచన చేస్తున్నాం. ఈ రోజు ముఖ్యమైన రెండు ప్రాజెక్టలు మన ముందు ఉన్నాయి. గోదావరి కాలుష్య నివారణ పధకం కింద డ్రైనేజి వ్యవస్థను మెరుగు పరచాలి. టెంపుల్ టూరిజం ద్వారా ప్రక్షాళన పేరుతో గోదావరి తీరంలో కొత్త ఘాట్స్ నిర్మాణాలు చేయాలి. పుష్కరాలను ఒక వేదికగా తీసుకుని నగరాన్ని అభివృద్ధి పరుచుకోవాలి. రుగుతున్న నగరాన్ని దృష్టిలోకి తీసుకుని ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా రోడ్లు, విస్తరణ, జరగాలి. నగరం అన్నిరకాలుగా అభివృద్ధి చెందితేనే వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.