ఉక్రెయిన్- రష్యా మధ్య జరుగుతున్న యుద్దం కారణంగా ప్రపంచ దేశాలకు తీవ్ర నష్టం వాటిల్లే చాన్స్ ఉన్నట్లు ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా.. బంగారం ధరలు, అలాగే.. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉన్నట్లు నిపుణులు కుండ బద్దలు కొట్టి చెబుతున్నారు. యుద్దం వస్తుందనే నేపథ్యంలోనే.. బ్రెంట్ క్రూడ్ 100 డాలర్లకు చేరువైంది.
ఇది 120 డా లర్లకు చేరవచ్చని బ్యాంక్ ఆఫ్ ఆమెరికా అంచనా వేసింది. ఒక వేళ ఇదే జరిగితే.. ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయి. ఇటు బంగారం కూడా 50 దాటి మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇలాంటి తరుణంలో.. ఉక్రెయిన్- రష్యా మధ్య జరుగుతున్న యుద్దంపై ఇండియా తటస్థత వైఖరిని ఎంచుకుంది. శాంతియుతంగా చర్చలు జరుపుకోవాలని ఇండియా పేర్కొంటొంది.