రష్యా దాడికి ప్రతి దాడి తప్పదు.. ఉక్రెయిన్ పై దాడి అన్యాయం: జోబైడెన్

-

ఉక్రెయిన్ పై యుద్దం ప్రకటించింది. ఉక్రెయిన్ పై రష్యా దాడిపై అమెరికా స్పందించింది. రష్యా దాడికి ప్రతి దాడి తప్పదని హెచ్చరించారు జో బైడెన్. ఈ డాడిలో జరిగే మరణాలకు, విధ్వంసాలను రష్యా మాత్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని జో బైడెన్ అన్నారు. అమెరికా.. దాని మిత్ర పక్షాలు ఐక్యంగా, నిర్మయాత్మకంగా స్పందిస్తామయని ఆయన హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ముందస్తు ప్రణాళికలతో యుద్ధాన్ని ఎంచుకున్నారని ఆరోపించారు. ఈ యుద్దం ప్రాణ నష్టం, బాధను మిగులుస్తుందని జోబైడెన్ అన్నారు. ఉక్రెయిన్ పై రష్య దాడి అన్యాయం అని ఆయన అన్నారు. ప్రపంచం మొత్తం ఉక్రెయిన్ ప్రజల కోసం ప్రార్థనలు చేస్తోందని అన్నారు. 

ఇదిలా ఉంటే జోబిడెన్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాడు. రేపు ఉదయం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జీ 7 దేశాలతో పాటు.. నాటో మిత్ర దేశాలతో సమావేశం కానున్నారు. మరోవైపు ఉక్రెయిన్ లోని 11 నగరాలపై రష్యా విరుచుకుపడుతోంది. ఇప్పటికే.. కీవ్ నగరాన్ని ఆక్రమించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news