రష్యా – ఉక్రెయిన్ వార్: అంతర్జాతీయంగా భారీగా పెరిగిన క్రూడ్, బంగారం ధరలు

-

రష్యా- ఉక్రెయిన్ మధ్య వార్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ రోజు ఉదయం రష్యా.. ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించింది. ఉక్రెయిన్ పై ముప్పేటా దాడి చేసింది. ఇప్పటికే అంతర్జాతీయంగా పలు దేశాల్లోని స్టాక్ మార్కెట్ లు కుప్పకూలుతున్నాయి. మరోవైపు రష్యా – ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు ప్రపంచ దేశాలపై కనిపిస్తున్నాయి. 

ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్, బంగారంపై ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ ధర 100 డాలర్లకు చేరింది. గత ఏడు సంవత్సరాల్లో ఇదే గరిష్టం. బంగారం ధరలు కూడా భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర రూ. 642 పెరిగి.. రూ. 51031కి చేరింది. ఇక వెండి ధర కూడా కేజీపై రూ. 844 పెరిగి రూ. 65,699 కి చేరింది.

రష్యా- ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు భారత్ పై కూడా పడనునున్నాయి. ఇప్పటికే సెన్సెక్స్ 1,428.34 పాయింట్లు పడిపోయింది. రానున్న రోజుల్లో ఇండియాలో కూడా పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news