తిరుమలలో నేటి నుంచి వికలాంగుల, వృద్ధుల దర్శనాలు పున:ప్రారంభం

-

శ్రీవారి భక్తులకు టీటీడీ పాలక మండలి అదిరిపోయే శుభవార్త చెప్పింది. వయోవృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనాలను పునరుద్దరిస్తున్నట్లు ప్రకటన చేసింది. కరోనా మహమ్మారి ఆంక్షలు విధించిన నేపథ్యంలో.. భక్తులకు దూరమైన సేవలను, దర్శనాలను క్రమంగా.. పునరుద్దరిస్తూ వస్తోంది టీటీడీ పాలక మండలి.

ఈ నేపథ్యంలో పలు నిషేధాలనున సడలిస్తు భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగిస్తోంది. రెండేళ్లుగా వికలాంగులు, వయో వృద్ధులకు నిలిచి పోయిన ప్రత్యేక దర్శనాలను… మళ్లీ పునరుద్దరించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగానే వికలాంగులు, వయో వృద్ధులకు ప్రత్యేక దర్శనాలను ప్రారంభిస్తోంది. ఇవాళ్టి నుంచి రోజులకు 1000 మందికి చొప్పున భక్తు లకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నట్లు ప్రకటన చేసింది టీటీడీ పాలక మండలి. శుక్రవారం మిగతా రోజుల్లో ఉదయం 10 గంటలకు.. శుక్రవారం మధ్యాహ్నాం 3 గంటలకు వారికి దర్శన సౌకర్యం కలుగనుంది.  ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని.. కరోనా నియమ నిబంధనాలు పాటిస్తూ.. ముందుకు పోవాలని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news