గుడ్ న్యూస్ : భారీగా త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు

-

బంగారం, వెండి కోనుగోలు దారుల‌కు గుడ్ న్యూస్. గ‌త రెండు రోజుల నుంచి పెరుగుతూ వ‌స్తున్న బంగారం, వెండి ధ‌ర‌లు ఈ రోజు కాస్త శాంతించాయి. ఈ రోజు ప‌ది గ్రాముల బంగారం పై రూ. 460 నుంచి రూ. 500 వ‌ర‌కు త‌గ్గాయి. అలాగే వెండి ధ‌ర‌కు కూడా భారీగానే త‌గ్గింది. ప్ర‌తి కిలో గ్రాము వెండి పై రూ. 800 నుంచి రూ. 1000 వ‌ర‌కు త‌గ్గింది. అయితే గ‌త రెండు రోజుల నుంచి బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా పెరిగాయి. గురు వారం ఏకంగా ప‌ది గ్రాముల బంగారం ధ‌ర ఏకంగా రూ. 50 వేల మార్క్ ను అందుకుంది. అయితే ఈ రోజు బంగారం, వెండి ధ‌ర‌లు శాంతించ‌డంతో సామాన్యులు ఊపిరి పీల్చుకున్నారు.

హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,500 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,640 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 67,700 గా ఉంది.

విజ‌య‌వాడ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,500 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,6340 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 67,700 గా ఉంది.

ఢిల్లీ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,500 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,650 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 63,200 గా ఉంది.

ముంబాయి న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,500 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,640 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 63,200 గా ఉంది.

కోల్‌క‌త్త న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,500 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,200 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 63,200 గా ఉంది.

బెంగ‌ళూర్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,500 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,640 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 63,200 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news