గుడ్ న్యూస్‌: దిగొచ్చిన బంగారం ధ‌ర‌.. షాక్ ఇచ్చిన వెండి..

-

నిన్న భారీగా పైకెగ‌సిన బంగారం ధ‌ర ఈ రోజు దిగొచ్చింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మంగళవారం తగ్గింది. రూ.100 దిగొచ్చింది. దీంతో బంగారం ధర రూ.41,770 నుంచి రూ.41,670కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. అయితే 24 క్యారెట్ల బంగారం మాదిరి మాత్రం కాదు. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.90 తగ్గుదలతో రూ.38,290 నుంచి రూ.38,200కు క్షీణించింది. బంగారం ధర తగ్గితే కేజీ వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగింది. కేజీ వెండి ధరలో ఈ రోజు రూ.49,500 వద్దనే నిలకడగా ఉంది.

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 క్షీణించింది. దీంతో ధర రూ.39,110 నుంచి రూ.39,100కు తగ్గింది. అదే స‌మ‌యంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 క్షీణతతో రూ.40,300కు తగ్గింది. ఇక కేజీ వెండి ధరలో ఎలాంటి మార్పు లేక‌పోవ‌డంతో రూ.49,500 వద్ద స్థిరంగా కొనసాగింది.

Read more RELATED
Recommended to you

Latest news