బ్రేకింగ్: భారీగా పైకెగ‌సిన బంగారం ధ‌ర‌.. వెండి కూడా పైపైకే..!

-

బంగారం జిగేల్‌మంటోంది. అడ్డూఅదుపు లేకుండా పరుగులు పెడుతూనే వస్తోంది. మళ్లీ కొండెక్కి కూర్చుంది. హైదరాబాద్ మార్కెట్లో ఆదివారం కూడా బంగారం భారీస్థాయిలో ఎగసింది.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు భారీ పెరుగుదల నమోదుచేసింది. మరో 990 రూపాయలు పెరిగింది. దీంతో బంగారం ధర 10 గ్రాములకు 43,430 రూపాయల నుంచి 44,420 రూపాయల వద్దకు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదేస్థాయిలో పైకెగసింది. 10 గ్రాములకు 910 రూపాయలు పెరిగింది. దీంతో 39,810 రూపాయల నుంచి 40,720 రూపాయలకు 22 క్యారెట్ల బంగారం ధర పెరిగింది.

బంగారం ధరతో పాటు, వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ఒక్కసారిగా కేజీ వెండి ధర 1000 రూపాయలకు పైగా పెరిగింది. దీంతో వెండి ధర నిన్నటి కేజీ కి 49,900 రూపాయల ధర నుంచి ఒక్కసారే 51,000 రూపాయలకు ఎగసింది. ఢిల్లీలో బంగారం ధర లు భగ్గుమంటున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 990 రూపాయలు ఎగసి 42,800 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 900 రూపాయలు పెరిగి 41,600 రూపాయల వద్దకు చేరింది. ఇక కేజీ వెండి ధర ఇక్కడ కూడా పెరిగింది.. దీంతో కేజీ వెండి 51,000 రూపాయలకు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news