ఏపీ ప్రభుత్వంలో సంచలనం, సిఎస్ కి తెలియకుండానే జీవోలు…!

-

ఏ ప్రభుత్వంలో అయినా సరే ప్రధాన కార్యదర్శి అనేది చాలా కీలకం. ప్రభుత్వ నిర్ణయాలు, జీవోలు విడుదల చేయడం, కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్ధవంతంగా నడిపించడం వంటివి చేస్తారు. అలాంటి సిఎస్ కి ఒక ప్రభుత్వంలో మాత్రం సరైన గుర్తింపు దక్కడం లేదు. ఏరి కోరి వచ్చిన ప్రభుత్వంలో కనీస గుర్తింపు లేక సిఎస్ ఇబ్బంది పడుతున్నారు. అసలు సిఎస్ ఎవరు…? ఆ కథ ఏంటీ…?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇప్పుడు సిఎస్ గురించే చర్చలు అన్నీ జరుగుతున్నాయి. గత ఏడాది నవంబర్ నెలలో బాధ్యతలు చేపట్టిన సిఎస్ నీలం సాహ్నీ ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వంలో. రాజధానికి తరలింపు విషయంలో ఆమెకు తెలియకుండా కర్నూలుకి విజిలెన్స్ కార్యాలయాలను తరలించే జీవో విడుదల అయింది. దీనిపై తర్వాత మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. సీనియర్ అధికారులు కూడా విస్మయం వ్యక్తం చేసారు.

ఇక ఆమెకు ప్రవీణ్ ప్రకాష్ అనే ఒక అధికారి ఆదేశాలు ఇవ్వడం అందరిని షాక్ కి గురి చేసిన వ్యవహారం. ఇవి ఎంత వరకు నిజమో తెలియదు గాని మీడియా మాత్రం వీటి విషయంలో ఎక్కువగా ఆసక్తి చూపించింది. ఒకటికి మించిన శాఖలకు సంబంధించిన అంశాలు, ఆ శాఖల ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకోవాల్సిన ఉత్తర్వులను జారీచేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉంటుంది.

ఈ విషయాన్ని బిజినెస్ రూల్స్ లో స్పష్టంగా చెప్పారు. కాని తాజాగా ప్రభుత్వం తీసుకున్న రెండు నిర్ణయాలు కూడా సిఎస్ కి తెలియకుండానే జరిగాయి. శుక్రవారం ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ను ఏర్పాటుచేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో సీఎస్‌ నీలం సహానీ పేరు గాని ఊసు గాని లేదు. ప్రభుత్వానికి సిఎం బాస్ అయితే పాలనా యంత్రాంగానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాస్. ఆమె చెప్పినట్టే నడుచుకోవాల్సి ఉంటుంది.

తాజాగా విడుదల అయిన జీవో కూడా ప్రవీణ్ ప్రకాష్ పేరు మీదే విడుదల అయింది. పాలనా యంత్రాంగం ఏ విధంగా నడవాలి అనే దాని మీదే బిజినెస్ రూల్స్ అనేవి ఉంటాయి. కాని వాటిని కాదని కొందరు అధికారులు చూపిస్తున్న అత్యుత్సాహ౦ ఇబ్బందిగా మారుతుంది. చాలా ఫైళ్ళు ఆమెకు తెలియకుండానే వెళ్ళిపోతున్నాయి. కాని హైకోర్ట్ మాత్రం ఆమెకు అక్షింతలు వేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news