బంగారం దిగొచ్చింది.. వెండి షాకిచ్చింది..!

-

పసిడి ప్రియులకు శుభవార్త. గత కొన్ని రోజులుగా చుక్కలు చూయిస్తున్న బంగారం ధరలు ఎట్టకేలకు దిగొచ్చాయి. భారీగా పడిపోయిన బంగారం ధర చూసి గోల్డ్ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే బంగారం ధర కిందకి దిగొస్తుంటే.. వెండి ధర మాత్రం పైపైకి పోతుంది. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ. 110 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 55,650కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది.

10 గ్రాముల ధర రూ. 110 తగ్గడంతో రూ. 51,000కు చేరుకుంది. అయితే వెండి ధర మాత్రం భారీగా పెరిగివయింది. కేజీ వెండి ధర రూ. 1050 పైకి దూసుకెళ్లింది. దీంతో ధర రూ. 68,880కు చేరింది. ఇక శ్రావణ మాసం పూర్తి కావస్తుండడం.. ఈ వారంలోనూ బంగారం, వెండి ధరల్లో పెద్దగా మార్పులు చోటు చేసుకోక పోవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news