స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్ఎంఎస్ అలర్ట్స్ కోసం సేవింగ్స్ ఖాతాదారులు ఎటువంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది బ్యాంకు. ఎస్ఎంఎస్ అలెర్ట్స్, అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ లేనందుకు ఏ విధమైన చార్జీలను వసూలు చేసేది లేదు అని బ్యాంకు ప్రకటన చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో కనీసం ఉండాల్సిన మినిమం బ్యాలెన్స్ అనే నిబంధన ఎత్తేసింది.
మెసేజ్ అలర్ట్స్ కోసం ప్రతీ ఏటా కూడా 12 రూపాయలు బ్యాంకు వసూలు చేస్తుంది. ఇప్పుడు వాటిని రద్దు చేస్తూ నిర్ణయం ప్రకటించింది. ఈ కరోనా సమయంలో ఆర్ధికంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే బ్యాంకు లు మారిటోరియం కూడా విధించాయి. దాదాపు ఆరు నెలలకు పైగా మారిటోరియం కొనసాగుతుంది. ఈ చార్జీలు రద్దు చేసి గుడ్ న్యూస్ చెప్పింది.