బంగారం… ప్రపంచంలో దీనికి ఉన్న డిమాండ్ మరే దానికి ఉండదు. ఇక మన ఇండియాలో బంగారం డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన దేశ మహిళలు బంగారాన్ని ఎగబడి కొంటారు. ఎంత ధర ఉన్నప్పటికీ… కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతారు మహిళలు. అయితే గత కొన్ని రోజులుగా బంగారం విపరీతంగా పెరుగుతోంది.
ఇక తాజా గా ఇవాళ కూ డా బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ నగరం లో బంగారం ధరల వివరాల్లోకి వెళితే … 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరిగి రూ. 48,870 కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 44, 800 కు చేరుకుంది. ఇక వెండి విషయానికి వస్తే… కిలో వెండి ధర ఏకంగా రూ. 1100 పెరిగి… రూ. 67,700 కు చేరుకుంది. దసరా పండుగ నేపథ్యం లో బంగారం ధరలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. త్వరలో మళ్లీ దిగువకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా నిపుణులు సూచనలు చేస్తున్నారు.