మగువలకు షాక్‌.. మళ్లీ పసిడి పరుగులు

రోజు రోజుకు దేశంలో బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే.. తాజాగా దేశంలో బంగారం ధరలు శుక్రవారం పెరిగాయి. 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ. 300 పెరిగి.. రూ. 48,550కి చేరింది. గురువారం ఈ ధర రూ. 48,250గా ఉండేది. ఇక 22క్యారెట్ల 100 గ్రాముల బంగారం ధర రూ. 3,000 పెరిగి, రూ. 4,85,500కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 4,855గా కొనసాగుతోంది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 330 వృద్ధి చెంది.. రూ. 52,970కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 52,640గా ఉండేది.

Hyderabad: Customer hold off on buying gold at 6-year high

అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 3,300 పెరిగి.. రూ. 5,29,700గా ఉంది. హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 48,550గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,970గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి. కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 49,310గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 53,780గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 48,550గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 52,970గాను ఉంది.