గుడ్ న్యూస్ : స్వల్పంగా తగ్గిన బంగారం ధర

-

నిన్న కాస్త గట్టిగానే పెరిగిన బంగారం ధర ఈ రోజు మాత్రం కాస్త మేర తగ్గింది. కానీ ఒక పక్క బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పెరిగింది. ఇక ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌ లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.140 తగ్గింది. దీంతో మొత్తం పది గ్రాముల ధర రూ.47,730కు చేరింది. అలానే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 తగ్గుదలతో రూ.52,060కు చేరింది. అయితే బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం కొంచెం పెరిగింది.

gold
gold

కేజీ వెండి ధర రూ.300 దాకా పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.62,400కు చేరింది. ఇక మరో పక్క అంతర్జాతీయ మార్కెట్‌ లో కూడా బంగారం ధర పడిపోయిందనే చెప్పాలి. బంగారం ధర ఔన్స్‌కు 0.07 శాతం తగ్గడంతో ఆ ధర 1877 డాలర్లకు క్షీణించింది. అంతర్జాతీయంగా కూడా బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పెరిగింది. వెండి ధర ఔన్స్‌ కు 0.02 శాతం పెరుగడంతో 23.35 డాలర్లకు పెరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news