గత కొద్ది రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తోన్న బంగారం ధరలు ఈ రోజు మాత్రం భారీగా తగ్గాయి. దేశంలో బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. ఫైజర్ కంపెనీ కోవిడ్ 19 వ్యా్క్సిన్‌పై చేసిన ప్రకటన ఇందుకు ప్రధాన కారణమని అంటున్నారు. కరోనా వైరస్ వ్యాక్సి్న్ 90 శాతం సమర్థవంతంగా పనిచేస్తోందని ఫైజర్ పేర్కొంది. దీంతో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయని అంటున్నారు. నిజానికి గత కొద్ది రోజులుగా బంగారం ధర పెరుగుతూనే వస్తోంది.
బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా పెరుగుతూ పోతోంది. ఈరోజు మాత్రం రెండు ధరలూ దిగోచ్చాయి. హైదరాబాద్ సహా విశాఖ పట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర నిన్నటి మీద ₹-1,640 తగ్గి ₹51,380కి తగ్గింది. అలానే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹-1,500 తగ్గి ₹47,100కి దిగింది. ఇక గత 5 రోజుల్లో కేజీ వెండి ధర రూ.690 దాకా పెరిగింది. అయితే నిన్నటి మీద కేజీకి పదిరూపాయలు పెరగడంతో కేజీ వెండి ధర ఏకంగా ₹-3,500 తగ్గి ₹61,900 రూపాయలకు చేరుకుంది.