నెటిజన్లకు కంగనా కౌంటర్‌..నచ్చకపోతే మూసుకోని..

బాలీవుడ్ సినీ పరిశ్రమలో కాంట్రవర్సీకి కేరాఫ్‌గా నిలిచిన కంగనా రనౌత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది..సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా..నిక్కచ్చిగా చెప్పేస్తుంది..అయితే కొన్నిసార్లు కంగనా ట్వీట్లు చాలా మంది సెలబ్రిటీలకు వ్యతిరేకంగా కూడా ఉంటాయి..బాలీవుడ్ హీరోలు,నిర్మాతల నుంచి రాజకీయ నేతల వరకూ ఎవ్వరిని వదలడం లేదు బాలీవుడ్‌ బ్యూటీ..ఇటీవలే ఉధ్ధవ్ ఠాకరే,మహత్మగాంధీ,నేహ్రూపై కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది..మరోవైపు కర్నాటక,తమిళనాడులో రైతులు చేస్తున్న ఆందోళనలపై కాంట్రావర్సీ వ్యాఖ్యలు చేసింది..


ఈమధ్య ఆమె కామెంట్ల వేడి మరింత ఎక్కువైంది. దీంతో, తాజాగా ఓ నెటిజెన్.. కంగనా తన ట్విట్టర్ ఖాతాలో సైలెంట్‌గా ఉంటే బాగుంటుందనే సలహా ఇచ్చారు.. దీనికి స్పందించిన కంగనా తన ట్విట్టర్ ఖాతాను తరచుగా చూసే అభిమానులకు తన ట్వీట్లు బోరు కొట్టినా, విసుగు తెప్పిస్తున్నా..మ్యూట్ చేసుకొవచ్చనీ..అవసరమైతే బ్లాక్ చేసుకోవచ్చనీ చెప్పింది. తనను ఆపడం మాత్రం కష్టమని తేల్చి చెప్పింది. తనను ద్వేషిస్తూ ప్రేమించొద్దనీ..ఇంతకన్నా బెటర్ ఏదైనా ఉంటే చూసుకొమ్మనీ కంగనా తన ట్విట్టర్ అభిమానులకు సూచించింది.