దీపావళి టపాసులపై ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం..ఆ రెండు గంటలకు మాత్రమే అనుమతి.

-

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్ ప్రారంభమైంది..మరోవైపు ఈ నెలలో కీలకమైన పండుగలు రావడంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి..తాజాగా దీపావళి సంబరాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది..జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. కేవలం రెండు గంటల పాటు మాత్రమే టపాసులు వినియోగంకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే టపాసుల కాల్చుకోవాలని సూచనలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కరోనా బాధితులను దృష్టిలో పెట్టుకొని ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టపాసుల అమ్మకాలపై కూడా కొన్ని నిషేధ ఆజ్ఞలు జారీ చేసింది. కేవలం కాలుష్యరహిత టపాసులు మాత్రమే అమ్మకాలు జరపాలని ఆదేశించింది.
దీపావళి సామగ్రి అమ్మే షాపుల వద్ద శానిటైజర్ వాడొద్దని ప్రభుత్వం సూచించింది..కరోనా వైరస్‌ ముఖ్యంగా ఊరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది..శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది..ఇప్పుడు దీపావళి పండుగ వేళ టపాసులు కాల్చడం వల్ల వాయుకాలుష్యం మరింత పెరిగి కరోనా విస్తరించే ప్రమాదం ఉంది..దీంలో దేశంలో చాలా రాష్ట్రాలు దీపావళి బాణా సంచాపై కీలక నిర్ణయాలు తీసుకున్నాయి..ఆయా రాష్ట్రాలు కేవలం రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చడానికి అనుమతి ఇచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news