గత నాలుగు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మళ్ళీ పెరగడం మొదలుపెట్టాయి. ఒక్కసారే తగ్గిన బంగారం ధరలు నిదానంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో శుక్రవారం బంగారం ధర పెరిగింది. 22 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర 610 రూపాయల పెరగడంతో… 41,660 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే… 520 రూపాయలు పెరిగింది.
45,300 రూపాయలకు చేరుకుంది. విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్లు పది గ్రాముల ధర 610 రూపాయలు పెరిగి 41,660 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర 520 రూపాయలు పెరిగింది. దీనితో 45,300 రూపాయలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీ లో కూడా బంగారం ధరలు పెరిగాయి.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 600 రూపాయల వరకు పెరగగా… 45,500కు చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 610 రూపాయలకు చేరుకుంది. దీనితో 42,770 రూపాయలకు చేరింది. ఇక్కడ వెండి ధరలు కూడా పెరిగాయి. కేజీ వెండి ధర 42 వేల మార్కు దాటి 42,420 రూపాయలుగా ఉంది.