దిగివస్తున్న పసిడి ధరలు ..!

-

గత రెండు మూడు రోజులుగా అమంతరం పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు మళ్ళీ తగ్గుముఖ౦ పడుతున్నాయి. శుక్రవారం కాస్త తగ్గింది బంగారం. వెండి కూడా అదే విధంగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధరలు కొంచెం వెనకడుగు వేసాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 170 రూపాయలు తగ్గడం తో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 43,310 రూపాయల నుంచి 45,140 రూపాయలకు చేరింది.

అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర కూడా అంతే తగ్గింది. 10 గ్రాములకు 170 రూపాయలు తగ్గింది. దీంతో 40,530 రూపాయల నుంచి 41,360 రూపాయలకు 22 క్యారెట్ల బంగారం ధర పడింది. దేశ రాజధాని ఢిల్లీ లో కూడా ఇలాగే ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 150 రూపాయలు తగ్గి 43,450 రూపాయల వద్దకు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 150 రూపాయలు తగ్గుదల నమోదు చేసి 42,250 రూపాయలకు వచ్చింది.

వెండి కూడా అలాగే తగ్గింది. వెండి ధరలు ఇక్కడా కేజీకి 180 రూపాయలు తగ్గాయి. దీంతో కెజీ వెండి 49,850 రూపాయలకు తగ్గింది. విజయవాడ, వైజాగ్ మార్కెట్ లో కూడా బంగారం ధరలు కాస్త తగ్గాయి. ఈ మూడు రోజుల్లో బంగారం భారీగా పెరిగింది. త్వరలోనే 50 వేలకు బంగారం చేరుకునే అవకాశం ఉందని అంటున్నారు. దీనితో కొనుగోలు చేసే వారికి ఇది మంచి తరుణం అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news